యెప్ మీకి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్

యెప్ మీకి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్

Published on Apr 10, 2014 12:40 PM IST

Sonu-Sood
సిక్స్ ప్యాక్ బాడీతో హీరోలకి సమానంగా ఉండే సోనూ సూద్ కి విలన్ పాత్రలు చేయడంలో మంచి పేరుంది. ప్రస్తుతం ఈ ఆరడుగుల అందగాడి చేతిలో చాలా భారీ బడ్జెట్ సినిమాలున్నాయి. ఇది కాకుండా అకోట్టగా ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ లో దూసుకొస్తున్న యెప్ మీ అనే ఆన్లైన్ షాపింగ్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయనున్నాడు. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం సోనూ సూద్ మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆగడు’ సినిమాలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు