తెలుగు సినిమాలపై దృష్టిపెట్టిన సోనాల్ చౌహాన్

sonal-chauhan
బాలయ్య బాబు సరసన లెజెండ్ సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ ఆ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూసి ఆశ్చర్యపడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా సోనాల్ చౌహాన్ కు మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమాలఫై దృష్టిపెట్టింది

“ఒక సినిమా కధ నచ్చితే అందులో ఎటువంటి పాత్రనైనా చేయడానికి నేను సిద్ధమే” అని తెలుగు సినిమాలపై తన ఆసక్తిని తెలిపింది. టాలీవుడ్ లో అగ్రదర్శకులు ఆమె దగ్గరకు వస్తున్నారు అని సమాచారం. టైం బాంబ్ పేలిందే పాటకు వస్తున్న ఆదరణ తనను ఆశ్చర్యపరిచిందని తెలిపింది

ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. రాధిక ఆప్టే హీరోయిన్. జగపతిబాబు విలన్

Exit mobile version