అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా.?

అనుష్కతో పాటు సోనాక్షి సిన్హా.?

Published on Apr 9, 2014 2:09 PM IST

sonakshi-sinha
ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాకి ఓ క్రేజీ కాంబినేషన్ రెడీ అవుతోంది. రజినీ కాంత్ తన తదుపరి సినిమాని కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు.

అందులో ఇప్పటికే అనుష్కని తీసుకున్నారని సమాచారం. మరో హీరోయిన్ కోసం బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆమె పాత్ర కాస్త నెగటివ్ గా ఉంటుందని సమాచారం.

కొచ్చాడియాన్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

తాజా వార్తలు