సూర్య తో పాటలో నర్తించనున్న సోనాక్షి సిన్హా ​?

Surya-and-Sonakshi
సొనక్షి సిన్హా చాలా రోజుల తరువాత దక్షిణ భారత సినిమాల్లో నటించనుందని వినిపిస్తున్న వార్త నిజం కానుంది. గత కొంతకాలం క్రితం క్రిష్ ఆమెని కలిసి ‘శివం’ అనే టైటిల్ వున్న సినిమాలో నటించాలని సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో మహష్ బాబు సరసన నటించనుండడంతో తను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిందని తెలిసింది. కానీ గత కొద్ది నెలలుగా ఈ సినిమాకు సంబందించిన సమాచారం లేదు. అయితే ఇప్పుడు మరొకసారి ఆమె లింగస్వామి సినిమాలో ఒక పాటకి డాన్సు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య, సమంతలు నటిస్తున్నారు. ఈ పాటలో నటించడానికి ఆమె అంగీకరించిందని డేట్స్ కూడా ఇచ్చిందని సమాచారం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటని వచ్చే నెలలో షూటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టార్ గా ఒక కొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకోనున్నాడని సమాచారం. ఈ సినిమాకి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదలకావచ్చు

Exit mobile version