జూన్ 14న సంథింగ్…సంథింగ్

జూన్ 14న సంథింగ్…సంథింగ్

Published on May 17, 2013 12:06 AM IST

Something-Something-New
సిద్ధార్ధ్, హన్సిక జంటగా నటిస్తున్న ‘సంథింగ్… సంథింగ్’ సినిమా జూన్ 14న విడుదలకు సిద్దంగావుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ వెర్షన్లలో ఒకేసారి విడుదల చేద్దాం అనుకున్నారు. ధనుష్ నటించిన ‘మారియన్’ కుడా మే 31న విడుదల కావడంతో ఈ సినిమాను ముందుగానే అనుకున్న జూన్ మొదటివారంలో కాక జూన్ మధ్యకు జరిపారు. సుందర్ సి దర్సకత్వం వహించిన ఈ సినిమాకు కుష్బూ నిర్మాత. తెలుగు అనువాద హక్కులను లక్ష్మిగణపతి ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. హన్సికను ప్రేమలో పడేయడానికి సిద్ధార్ధ్ కు సలహాలు ఇచ్చే లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం కనబడనున్నాడు. సత్య సంగీతం అందించాడు.

తాజా వార్తలు