కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రముఖ సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనింగ్ సినిమా ‘రౌడి’. ఈ సినిమాకు సంబందించిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదలైంది. దానికి సినీ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లబించింది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. డా మోహన్ బాబు లుక్ ఈ సినిమాలో చాలా కొత్తగా పాత్రకు సరిపోయే విదంగా ఉంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాలో మోహన్ బాబు ను ఎటువంటి విగ్ లేకుండా రియలస్టిక్ గా, న్యాచురల్ గా చూపించాలని అనుకున్నారు. ఈ సినిమాకి వచ్చిన స్పందనకు మోహన్ బాబు కుటుంబం రామ్ గోపాల్ వర్మని ప్రసంశలతో ముంచేసింది. ఈ సినిమా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సతీష్ ముత్యాల కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. మంచు విష్ణు, గజేంద్ర నాయుడు సమర్పణలో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.