భారీ ధరకి శేష్, మృణాల్ ‘డెకాయిట్’ ఆడియో హక్కులు!

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు షానియేల్ డియో తెరకెక్కిస్తున్న సాలిడ్ లవ్ అండ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమే “డెకాయిట్”. అయితే ఎపుడు నుంచో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. మరి ఇలా సినిమా టీజర్ వీడియో రాబోతుండగా దీనికి ముందు ఈ చిత్రం తాలూకా ఆడియో హక్కులపై సాలిడ్ ఇన్ఫో బయటకి వచ్చింది.

దీనితో ఈ సినిమా ఆడియో హక్కులు సోనీ మ్యూజిక్ వారు సొంతం చేసుకోవడం ఒకెత్తు అయితే ఏకంగా 8 కోట్లు ఈ సినిమా ఆడియో హక్కులకు చెల్లించడం మరొక ఎత్తు అని చెప్పాలి. అలాగే ఈ చిత్రానికి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండడం విశేషం. సో ఈ ఫ్యాక్టర్ కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా త్వరలోనే విడుదల కానుంది.

Exit mobile version