యంగ్ టైగర్ లైనప్ కూడా మాములుగా లేదుగా.!

యంగ్ టైగర్ లైనప్ కూడా మాములుగా లేదుగా.!

Published on Sep 11, 2020 7:02 AM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న “RRR” షూట్ కు సన్నద్ధం కానున్నాడు. ఇక అలాగే ఈ చిత్రం తర్వాత తారక్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక పవర్ ఫుల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమాను కమిట్ అయ్యిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే తారక్ లైనప్ లో మరో భారీ ప్రాజెక్ట్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అది కూడా ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్టే అన్నట్టు వినికిడి. అంతే కాకుండా సూపర్ స్టోరీ లైన్ తో ఉంటుందట. ఇక ఇవన్నీ చూస్తుంటే తారక్ లైనప్ మాత్రం మామూలుగా ఉండేలా లేదని చెప్పాలి.

తాజా వార్తలు