ప్రస్తుతం తెలుగులో మన తెలుగు రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 లాస్ట్ స్టేజ్ కు వస్తుంది. ఈ వారం పూర్తయితే ఇంకో రెండు వారాల్లో షో పూర్తి కానుంది. దీనితో విన్నింగ్ కంటెస్టెంట్ ఎవరా అన్నది ఆసక్తిగా మారింది. అయితే టైటిల్ రేస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ కు వస్తే అందులో అఖిల్ ఎలాగో ఫైనల్స్ కు వెళ్ళిపోయాడు. ఇంకో ఇద్దరినీ అనుకుంటే వారిలో ఖచ్చితంగా అభిజీత్ మరియు షోయెల్ లు ఉంటారు.
ఇదిలా ఉంటే షో స్టార్టింగ్ లో చాలా అగ్రెసివ్ గా ఉండే షోయెల్ నాగ్ ఒకమాటతో తనని తాను మార్చుకున్నాడు. దానితో తన గ్రాఫ్ మరింత పెరిగింది. మరి లేటెస్ట్ గా నిన్నటి ఎపిసోడ్ లో అభిజీత్ పై చేసిన ఊహించని కామెంట్ ఆసక్తికరంగా మారింది. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ తో ఎంత బాండింగ్ షోయెల్ కు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తనకి వద్దని ఫైనల్స్ టికెట్ ను అఖిల్ కు త్యాగం చేసాడు.
మరి అంత అర్ధం చేసుకున్న అఖిల్ ను కాదని ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అభిజీత్ మంచి రెస్పెక్టఫుల్ కంటెస్టెంట్ అని స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. ఇన్ని రోజులు ఎంతో క్లోజ్ గా ఉన్న అఖిల్ ను కాదని అభిజీత్ కే ఆ క్రెడిట్ ఇవ్వడం అతనికి ఊహించని ట్విస్ట్ గా మారంది. కానీ షోయెల్ నుంచి ఈ ఊహించని స్టేట్మెంట్ రావడంతో అభిజీత్ ఫ్యాన్స్ కాస్త ఖుషీగా ఉన్నారు.