రజిని కాంత్ రాబోతున్న చిత్రం “కొచ్చాడియాన్” లో రజినీకాంత్ సోదరిగా నటి స్నేహ నటించబోతున్నారని గతం లో చెప్పాము కాని ఇప్పుడు డేట్స్ కుదరకపోవడం మూలాన ఈ భామ ఈ చిత్రం నుండి తప్పుకుంది.ఇంకా ఈ చిత్ర చిత్రీకరణ మొదలు కాని పక్షాన సౌందర్య కి ఇది పెద్దగా సమస్య కాదు.రుక్మిణి ఈ పాత్రలో కనిపించనుంది చివరగా రుక్మిణి ఆనంద తాండవం లో కనిపించారు. ఈ చిత్రం లో దీపిక పదుకొనే ,ఆది మరియు జాకి ష్రాఫ్ లు నటిస్తున్నారని ఇప్పటికే వార్తలున్నాయి. సొందర్య.ఆర్.అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ 3డి చిత్రానికి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. కే.ఎస్.రవి కుమార్ ఈ చిత్రానికి కథను అందించారు.