స్నేహ ఉల్లాల్ తన అందాలతో మరో సారి సెగ పుట్టించబోతుంది. గతం లో “లిక్” అనే పేరుతో విడుదల చేసిన వీడియో కి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్య పోయిన స్నేహ అలాంటిదే మరొక వీడియో చేస్తున్నారు. మొదటి వీడియో కి దర్శకత్వం వహించిన శరత్ శెట్టి దీనికి కూడా పని చెయ్యనున్నారు. ఈ నటి ప్రేక్షకుల దృష్టి ని తన మీదకు త్రిప్పుకొనుట బాగా తెలుసుకుంది చాలా రోజుల తరువాత విడుదల చేసిన ఈ చిత్రాలు ఇంటర్ నెట్ లో అద్బుతమయిన స్పందన కనబరిచింది. మీడియా కూడా ఈ వీడియో గురించి చాలా సార్లు ప్రస్తావించారు. స్నేహ ఉల్లాల్ ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మాణం లో ఒక చిత్రం ఒప్పుకుంది. చూస్తుంటే ఈ నటి తన కెరీర్ ని మలుపు తిప్పుకోటానికి సరయిన దారినే ఎంచుకున్నట్టుంది.