అక్కినేని నాగేశ్వర రావు గారి భార్య అక్కినేని అన్నపూర్ణ గారు ఈ రోజు ఉదయం మరణించారు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణంగా ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. అన్నపూర్ణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో జన్మించారు. ఫెబ్రవరి 19న 1949 వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వర రావు గారిని వివాహమాడారు. నాగేశ్వర రావు గారు ఆవిడ పేరుతోనే హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో కట్టడం జరిగింది.
123తెలుగు.కాం తరపున అక్కినేని నాగేశ్వర రావు గారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం.