మోడీపై పాటని లాంచ్ చేసిన స్మిత

Smita-Wake-Up-India-Album-L

2014 ఎలక్షన్స్ లో భాగంగా కొంత మంది తారలు రాజకీయాల్లో మెరవనుంటే, కొంతమంది తమకు నచ్చిన పార్టీలకు సపోర్ట్ చేయనున్నారు. అదే కోవలోకి ఇప్పుడు పాప్ సింగర్ స్మిత కూడా వచ్చి చేరింది. స్మిత ‘వేక్ అప్ ఇండియా’ అనే పేరుతో నరేంద్ర మోడీకి సపోర్ట్ గా ఒక ఆల్బం ని లాంచ్ చేసారు. గత కొంత కాలంగా మోడీకి సపోర్ట్ చేస్తున్న స్మిత ప్రస్తుత రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రతిబింబించేలా ఈ పాటని రాశారు.

ఓ ప్రముఖ పత్రికతో స్మిత మాట్లాడుతూ ‘ నేను బిజినెస్ పనిమీద చాలా సార్లు అహ్మదాబాద్ కి వెళ్లాను. అక్కడ డెవలప్ మెంట్ ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యానని’ తెలిపింది. విజయవాడలో 3000 మందికి పైగా హాజరైన వేడుకలో ఈ ఆల్బం ని లాంచ్ చేసారు.

అనంత్ శ్రీరాం సాహిత్యం అందించిన ఈ పాటలను స్మిత టీం కాన్సెప్ట్ పరంగా డిజైన్ చేసారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. మోడీకి సపోర్ట్ గా రిలీజ్ చేసిన ఈ పాత ఎంతవరకూ హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.

Exit mobile version