చిన్న సినిమాల్లో ఈ వారం బాక్స్ ఆఫీసు కొల్లగోట్టేది ఎవరు?

చిన్న సినిమాల్లో ఈ వారం బాక్స్ ఆఫీసు కొల్లగోట్టేది ఎవరు?

Published on Apr 11, 2013 1:49 AM IST

Small-films
ప్రస్తుతం ‘బాద్షా’ సినిమా తప్ప బాక్స్ ఆఫీసు వద్ద చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేదు. కావున ఇలాంటి తరుణాన్ని చిన్న సినిమాలు అవకాశంగా తీసుకొని బాక్స్ ఆఫీసు వద్ద క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. కేవలం ఏప్రిల్ 11 నుంచి 13 వ తేదీ లోపు డబ్బింగ్ తో కూడా కలుపుకొని మొత్తం ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రేస్ లో ఉదయ కిరణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘జై శ్రీరామ్’, నవదీప్ హీరోగా నటించిన ‘వసూల్ రాజా’, తమిళ హీరో ఆర్య నటించిన ‘క్రేజీ’ సినిమాలు రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తరవాత శుక్ర, శని వారాల్లో ‘యమవీర'(ఇంగ్లీష్ డబ్బింగ్), ‘1234’(కన్నడ డబ్బింగ్), ‘ఒక కాలేజ్ స్టొరీ’ సినిమాలు విడుదల కానున్నాయి.

ఈ ఆరు సినిమాల్లో ఏదైనా బాక్స్ ఆఫీసు వద్ద సరైన విజయాన్ని అందుకుందా? లేక మూవీ లవర్స్ ఈ వారం కూడా ‘బాద్షా’ కే మొగ్గు చూపుతారా? అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

తాజా వార్తలు