చిన్న సినిమాల బెస్ట్ డీల్.. లాక్ డౌన్ లో రోజుకు లక్ష ఆదాయం.

చిన్న సినిమాల బెస్ట్ డీల్.. లాక్ డౌన్ లో రోజుకు లక్ష ఆదాయం.

Published on Apr 13, 2020 12:22 PM IST

అదేంటి లాక్ డౌన్ లో థియేటర్లు అన్ని మూసివేశారు కదా, వసూళ్లు ఎక్కడినుండి వస్తున్నాయని ఆలోచిస్తున్నారా. ఇక్కడే అసలు విషయం దాగుంది. ఇటీవల విడుదలైన కొన్ని చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ నుండి వెళ్లిపోయాయి. మాధ, పలాస 1978 చిత్రాలు చిన్న చిత్రాలుగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాలు లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ నుండి వెళ్లిపోయాయి.

ఇక గత ఏడాది చివర్లో విడుదలైన రాజావారు రాణిగారు కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఐతే వీటిలో మాధ మూవీని అమెజాన్ ప్రైమ్ భారీగా ప్రమోట్ చేస్తుండగా, మిగతా రెండు చిత్రాలైన పలాస, రాజావారు రాణిగారు చిత్రాలను ప్రమోట్ చేయడం లేదు. కాగా ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాల ప్రమోషన్స్ సొంత ఖర్చుతో చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసిన తరువాత సొంత డబ్బులతో నిర్మాతలు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

పలాస, రాజావారు రాణిగారు చిత్రాల నిర్మాతలు ఆ చిత్రాలను మొత్తంగా ప్రైమ్ కి అమ్మేయలేదట. పే ఫర్ వ్యూ ప్రకారంగా ఒప్పందం చేసుకున్నారట, దాని ప్రకారం వ్యూస్ ని బట్టి నిర్మాతల వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. అందుకే నిర్మాతలు స్వయంగా ఈ చిత్రాల ప్రొమోషన్స్ చేస్తున్నారు. దాదాపు రోజుకు లక్ష వరకు ఈ సినిమాల వలన నిర్మాతలకు ఆదాయం వస్తుందని వినికిడి.

తాజా వార్తలు