‘శివతాండవం’ అందరినీ ఆకట్టుకుంటుంది : విక్రమ్

‘శివతాండవం’ అందరినీ ఆకట్టుకుంటుంది : విక్రమ్

Published on Sep 6, 2012 3:12 PM IST

తమిళ హీరో విక్రమ్, యోగా బ్యూటీ అనుష్క కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘శివతాండవం’. ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ అందుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో తన చెవులతో విని తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకునే కళలో ఆరితేరి తన గమ్యాన్ని చేరుకునే పాత్రని విక్రమ్ పోషించారు. ఈ చిత్రంలోని ఎక్కువ భాగాన్ని లండన్లో చిత్రీకరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయం సాదిస్తుందని మరియు అందరికీ మంచి ఫీల్ ఇస్తుందని విక్రమ్ భావిస్తున్నారు.

ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి. కళ్యాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ’ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. త్వరలోనే ఈ చిత్ర ఆడియోను విడుదల చేస్తాం. జి.వి ప్రకాష్ కుమార్ మంచి సంగీతాన్ని అందించారని’ ఆయన అన్నారు. జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్ష్మీ రాయ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు