‘సితారే జమీన్ పర్’కు అక్కడ పూర్ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే!

‘సితారే జమీన్ పర్’కు అక్కడ పూర్ కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే!

Published on Jun 21, 2025 9:00 PM IST

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’ మంచి అంచనాల మధ్య నిన్న(జూన్ 20) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను ఆర్.ఎస్.ప్రసన్న డైరెక్ట్ చేయగా అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశారు. మానసిక దివ్యాంగుల నేపథ్యంలో సాగే ఎమోషనల్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ ఎమోషనల్ రైడ్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు కొన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిని చూపడం లేదు. అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా చాలా పేలవంగా ప్రదర్శితమవుతుంది.

ఈ చిత్రం నార్త్ అమెరికాలో తొలిరోజు కేవలం 284,389 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ చిత్ర కలెక్షన్స్ మున్ముందు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ విధంగా వెళ్తే, ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు