నా జీవితంలో ‘కృష్ణుడు’ ప్రభాస్ – విష్ణు మంచు

నా జీవితంలో ‘కృష్ణుడు’ ప్రభాస్ – విష్ణు మంచు

Published on Jun 21, 2025 10:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కన్నప్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీకి సంబంధించిన స్టార్స్ ఈ సినిమా విశేషాలను ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. హీరో మంచు విష్ణు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సినిమా నేడు ఇంత గ్రాండ్‌గా రావడానికి ఆ శివుడే కారణమని.. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా మంది కారణమని.. అందులో హీరో ప్రభాస్ కూడా ఒకరని విష్ణు అన్నాడు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమాలో నటించాడంటే ఆయన నుంచి అందరూ మంచితనాన్ని నేర్చుకోవాలని మంచు విష్ణు అన్నాడు. తన జీవితంలో ‘కృష్ణుడు’ ప్రభాస్ అని.. ప్రభాస్ జీవితంలో తాను ‘కర్ణుడు’ అని విష్ణు కామెంట్ చేశాడు.

ఇక ఈ సినిమాకు ఆ దైవం ఆశీస్సులు ఉన్నాయని.. అందుకే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని మంచు విష్ణు అన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు