ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 20, 2025
స్ట్రీమింగ్ వేదిక : జీ5
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : దిల్జిత్ దోశాంజ్, డయానా పెంటీ, బొమన్ ఇరానీ, రత్న పాఠక్ షా, చంకీ పాండే, బనిత సంధు, సుమిత్ వ్యాస్ తదితరులు
దర్శకుడు : రవి ఛబ్రియా
నిర్మాతలు : హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్, రోహిణి సింగ్, మన్మీ్త్ సింగ్
సంగీత దర్శకుడు : జోయల్ క్రాస్టో
సినిమాటోగ్రాఫర్ : మార్సిన్ లస్కావిక్
ఎడిటర్ : రవి ఛబ్రియా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ దిల్జిత్ దొశాంజ్ హీరోగా నటించిన మిస్టరీ కామెడీ చిత్రం ‘డిటెక్టివ్ షెర్డిల్’. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ :
ధనవంతుడైన పంకజ్ భట్టి(బొమన్ ఇరానీ) హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కేసును ఛేదించేందుకు డిటెక్టివ్ షెర్డిల్(దిల్జిత్ దోశాంజ్) రంగంలోకి వస్తాడు. అయితే, పంకజ్ భట్టి కుటుంబ సభ్యులను డిటెక్టివ్ షెర్డిల్ హౌస్ అరెస్ట్ చేస్తాడు. ఈ క్రమంలో డిటెక్టివ్ షెర్డిల్ ఎలాంటి నిజాలను తెలుసుకుంటాడు..? ఈ హత్య వెనకాల ఉన్నది ఎవరు..? పంకజ్ భట్టిని హత్య చేయాలని ప్లా్న్ చేసింది ఎవరు..? అసలు వారు ఆయనను ఎందుకు చంపాలని ప్లాన్ చేస్తారు..? చివరకు ఏం జరిగింది..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
డిటెక్టివ్ సినిమాల్లో ఉండే కథనే ఈ సినిమాలోనూ మనకు కనిపిస్తుంది. ఓ హత్య జరగడం.. దాని వెనకాల ఉన్న నేరస్థులను కనుగొనే క్రమంలో ఎలాంటి నిజాలు బట్టబయలు అవుతాయి అనేది చక్కగా ప్రెజెంట్ చేశారు. డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ సీరియస్ నోట్‌తో ఉంటాయి. కానీ, ఈ సినిమాలో డిటెక్టివ్ షెర్డిల్ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.
ఇలాంటి సినిమాలకు రన్‌టైమ్ విషయంలో తేడాలు జరుగుతుంటాయి. కానీ, ఈ సినిమాను చాలా తక్కువ రన్‌టైమ్‌తో తెరకెక్కించిన తీరు బాగుంది. హీరోతో పాటు సినిమాలోని మిగతా యాక్టర్స్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు స్క్రీన్ ప్లే చాలా షార్ప్‌గా ఉండాలి. కానీ, ఈ సినిమాలో మనకు అది కనిపించదు. చాలా సీన్స్ ఫ్లాట్‌గా వెళ్లినట్లు అనిపిస్తాయి. కొన్ని సీన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కానీ పరిస్థితి.
కథలో ట్విస్టులు ఇవ్వాలనే ప్రయత్నం ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ఒక ట్విస్ట్ ఆకట్టుకుంటుందని అనుకునేలోపే అది రివీల్ చేసే అంశం పెద్ద ఆసక్తిని క్రియేట్ చేయలేకపోతుంది. దీంతో ఈ సినిమాలో ట్విస్టులు ఉన్నా, అది అందరికీ తెలిసినవే కావడం మైనస్.
ఇక చాలా సీన్స్ ల్యాగ్ అనిపించడంతో, ఇంత చిన్న రన్‌టైమ్ కూడా ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది. అటు క్లైమాక్స్ రివీల్ కూడా ఇంకా బెటర్‌గా ప్లాన్ చేసి ఉండాల్సింది. ఫ్లాట్‌గా సాగే కథనంతో ఈ మూవీ ఓ రొటీన్ డిటెక్టివ్ చిత్రంగా మిగిలిపోయింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు రవి ఛబ్రియా ఈ సినిమాను హ్యాండిల్ చేయడంలో తడబడినట్లు అనిపిస్తుంది. కథను మెయిన్ ట్రాక్‌పై ఉంచే ప్రయత్నం చేసినా అది ఫెయిల్ అయ్యింది. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎడిటింగ్ వర్క్ కూడా ఆయనే చూసుకోవడంతో అది బెడిసికొట్టింది. సంగీత పరంగా చెప్పుకునేందుకు పెద్దగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా ‘డిటెక్టివ్ షెర్డిల్’ చిత్రం మిస్టరీ టెంప్లేట్‌తో ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో దిల్జిత్ దోశాంజ్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తాడు. అయితే, ఫ్లాట్‌గా సాగే కథనం, బోరింగ్ స్క్రీన్ ప్లే, ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team