సిస్టర్ సెంటిమెంట్ తో రానున్న నాగార్జున

సిస్టర్ సెంటిమెంట్ తో రానున్న నాగార్జున

Published on Jul 22, 2013 12:20 PM IST

zarashah

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమా ప్రస్తుతం అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంచి రెస్పాన్స్ నమోదు చేసుకున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. మేము విన్న సమాచారం ప్రకారం ఈ సినిమాని సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిస్తున్నారు. ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’ సినిమాలో నటించిన జరషా ఈ సినిమాలో నాగార్జున సిస్టర్ గా కనిపించనుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఈమె పాత్ర చాలా ప్రదానం కానుంది.
గతంలో నాగార్జున ‘హలో బ్రదర్’, ‘ఆజాద్’, ‘సీతారామ రాజు’ లాంటి పలు సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో నటించాడు. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. రిచా గంగోపాద్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు