నరేంద్ర మోడిని కలిసిన శిరీష్ భరద్వాజ్

నరేంద్ర మోడిని కలిసిన శిరీష్ భరద్వాజ్

Published on May 18, 2013 4:20 PM IST

Sirish-Bharadwaj-with-Naren

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఆయన నివాసంలో శిరీష్ భరద్వాజ్ కలుసుకున్నారు. ఈ సమావేశంలో శిరీష్ దాదాపు గంటకుపైగా ఆయనతో మాట్లాడారు. ముఖ్యంగా ఈ సమవేశంలో తెలంగాణా విషయాన్ని చర్చించినట్టు సమాచారం. ఈ యంగ్ రాజకీయ నాయకుడితో మోడీ బీజేపి రాష్ట్ర రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అందరూ మిమ్మల్ని ప్రధాన మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు అని అన్నాడు. రాష్ట్రము, దేశం చాలా సమస్యలతో సతమతవవుతోంది. ప్రస్తుతం దేశంలో చాలా మార్పులు జరగాల్సివుంది అని తెలియజేశాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ త్వరలో రాష్ట్రాన్ని విసిట్ చేయడానికి వస్తానని చెప్పడం జరిగింది.

తాజా వార్తలు