దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన సిరి మీడియా వారు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులు దాదాపుగా 23 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగులకి అల్లు అర్జున్ కామెడీ టైమింగ్ తోడైతే ప్రేక్షకులకు నవ్వుల పండగే. ఈ చిత్రంలో ఇలియానా హీరొయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.