మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంటుంది. ఇక ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
దీని ప్రకారం స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా పనుల్లో భాగం అయినట్లు వినిపిస్తోంది. సుకుమార్ సహా నిర్మాతగా ఈ సినిమాకి సహకారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తాను దగ్గరుండి చూసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
