ఇంటర్నేషనల్ లెవెల్లో సాలిడ్ హైప్ అండ్ బజ్ ని సెట్ చేయగలిగే ఇండియన్ అండ్ తెలుగు సినిమా ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అనే చెప్పాలి. ఆల్రెడీ సన్నాహాలు ఆ రీతిలోనే జరుగుతుండగా ఈ నవంబర్ నెలలో అసలు సిసలు బ్లాస్ట్ ట్రీట్ రాబోతుంది.
ఇలా నవంబర్ 16కి అలా గ్రాండ్ ఈవెంట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఉంది కాని లేటెస్ట్ బజ్ ఏంటంటే ఒకరోజు ముందే అంటే నవంబర్ 15నే గట్టి సర్ప్రైజ్ ఒకటి వస్తుంది అని వినిపిస్తుంది. మరి అదేంటి అనేది ఇంకొంత సమయం ఆగి చూడక తప్పదు. కొన్ని ఇంట్రెస్టింగ్ టైటిల్స్ కూడా వైరల్ అవుతున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.
