సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి చేదు వార్త?

Rajinikanth

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో జైలర్ 2 చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ హైప్ ఉన్న ఈ సినిమా తర్వాత రజినీకాంత్ ఓ సెన్సేషనల్ మల్టీస్టారర్ కూడా చేయనున్నారు. అయితే తన లైనప్ కి సంబంధించి అభిమానులకి రానున్న రోజుల్లో చేదు వార్త తప్పదని ఇప్పుడు వినిపిస్తోంది.

కమల్ తో మల్టీస్టారర్ కాకుండా దర్శకుడు సుందర్ సి తో రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నారట. మరి ఈ రెండు సినిమాలు తర్వాత రజినీకాంత్ ఇక సినిమాకి స్వస్తి చెప్పి రిటైర్ అయిపోతారని తెలుస్తోంది. ఇది మాత్రం అభిమానులకి షాకింగ్ అని చెప్పాలి. మొదట సుందర్ సి సినిమా చేశాక చివరి సినిమాగా కమల్ తో చేయనున్నారట. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version