బుకింగ్స్ లో ‘సింగిల్’కి సాలిడ్ రెస్పాన్స్!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ అలాగే ఇవానా హీరోయిన్స్ గా దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన హిట్ చిత్రం “సింగిల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం శ్రీవిష్ణు నుంచి మరో హిట్ గా నిలవగా ప్రస్తుతం ఈ చిత్రం మంచి వసూళ్లు సహా మంచి ఓపెనింగ్స్ కూడా అందుకుంది.

ఇలా వీకెండ్ కి సాలిడ్ నంబర్స్ సెట్ చేస్తున్న ఈ చిత్రం 2 రోజుల్లో బుక్ మై షోలో 1 లక్ష 50 వేలకి పైగా టికెట్స్ ని సేల్ చేసుకుంది. దీనితో ఆడియెన్స్ ఈ సినిమా పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి ఈ ఆదివారం కూడా మంచి బుకింగ్స్ కనబరుస్తుండగా మూడో రోజు కూడా మంచి వసూళ్లు అందుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ వారు సమర్పణలో ఈ చిత్రం విడుదలకి వచ్చింది.

Exit mobile version