గాయపడ్డ ప్రముఖ గాయని ఎస్.జానకి


ప్రముఖ నేపధ్య గాయని ఎస్. జానకి తిరుపతిలోని హోటల్ బాత్ రూములో జారి కింద పడ్డారు.వెంటనే ఆమెను స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక మెడికల్ టీం ఆమెకు చికిత్స చేస్తున్నారు. ప్రాధమిక రిపోర్ట్ ప్రకారం ఆమె మెదడులో రక్తం గడ్డ కట్టడం జరిగిందనీ, వెన్నెముకకి కూడా బలమైన దెబ్బ తగిలిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 73 సంవత్సరాలు. ఆమె విజయవంతంగా మూడు దశాబ్దాలకు పైగా పాటలు పడుతున్నారు. ఆమె ఇళయరాజా గారి సంగీతంలో ఎక్కువగా పాటలు పాడారు. జానకి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Exit mobile version