బోయపాటి సినిమాలో హిట్ జోడీ !

బోయపాటి సినిమాలో హిట్ జోడీ !

Published on Aug 30, 2020 1:04 AM IST


మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా
రానున్న సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందట. సీనియర్ బాలయ్య పాత్రకు భార్య పాత్రలో మాజీ హీరోయిన్ సిమ్రాన్ ను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సిమ్రాన్ ది హీరోయిన్ పాత్ర కాకపోయినా ఒకరకంగా సెకెండ్ హీరోయిన్ పాత్ర అనుకోవచ్చు. సిమ్రాన్ – బాలయ్య కాంబినేషన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. గుండుతో ఉన్న రోల్ తో పాటు ఫుల్ మీసంతో వైట్ అండ్ వైట్ గెటప్ లో మరో రోల్. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు