మరోసారి జత కట్టనున్న శింబు – నయనతార

మరోసారి జత కట్టనున్న శింబు – నయనతార

Published on Nov 19, 2013 4:50 PM IST

simbu-nayanatara
తమిళ్ స్టార్ శింబు – నయనతార కలిసి గతంలో ‘వల్లవన్'(తెలుగులో వల్లభ) సినిమాలో జోడీ కట్టి ప్రేక్షకులని అలరించారు. ఆ సినిమా టైంలో రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరి మధ్యా డేటింగ్ కొనసాగింది. కానీ అది పెళ్లి వరకు దారి తీయలేదు. ఆ సంఘటన తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు.

చాలా సంవత్సరాల తర్వాత శింబు – నయనతార కలిసి మరో సినిమాలో నటించనున్నారు. తమిళ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని పాండిరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ పాండిరాజ్ తెలియజేశారు. ఇది ఆశ్చర్యపరిచే విషయమే కానీ ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈ సారి కూడా శింబు – నయనతార మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి..

తాజా వార్తలు