మరో రెండు చిత్రాలను నిర్మించనున్న సిద్దార్థ్


ఈ ఏడాది మరో రెండు చిత్రాలను నిర్మించనున్నట్టు సిద్దార్థ్ అధికారికంగా ప్రకటించారు. నిర్మాతగా తన తొలి చిత్రం “లవ్ ఫెయిల్యూర్” మంచి వసూళ్లు సాదించింది ఇదే కాకుండా హింది చిత్రం “విక్కి డోనార్” రీమేక్ హక్కులను కొనుక్కున్నాడని పుకార్లు కూడా వచ్చింది. ” రెండు చిత్రాల కోసం పని మొదలు పెట్టాం వీటి చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో మొదలవుతుంది.రెండింటిలో నేను నిర్మిస్తూ నటిస్తాను మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను” అని ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఆయన నందిని రెడ్డి రాబోతున్న చిత్రంలో మరియు వెట్రిమారన్ నిర్మిస్తున్న తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా అయన అంతర్జాతీయ చిత్రం “మిడ్ నైట్స్ చిల్డ్రన్” టొరోంటో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపిక అయ్యింది. ఈ ఏడాది సిద్దార్థ కి బాగా కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది.

Exit mobile version