త్వరలో ప్రారంభం కానున్న సిద్దార్థ్ కామెడీ థ్రిల్లర్

త్వరలో ప్రారంభం కానున్న సిద్దార్థ్ కామెడీ థ్రిల్లర్

Published on May 23, 2013 5:02 PM IST

Siddharth-KArthik-Subbaraj

హీరో సిద్ధార్థ్ తర్వాతి సినిమా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో రాబోతుంది. ఈ సినిమా జూన్ లో ప్రారంభంకానుంది. ఈ సినిమాని ఫైవ్ స్టార్ ఫిల్మ్స్ బ్యానర్ పై కతిరేసన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు,తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. గతంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ‘ పిజ్జా’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పేరు ఖరారు కాని ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది అని సిద్దార్థ్ అన్నాడు. ఈ సినిమాలో సిద్దార్థ్ గత సినిమా కంటే డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. తెలుగులో ‘గజరాజు’ (తమిళ వర్షన్ పేరు కుమ్కి) సినిమాలో నటించిన లక్ష్మీ మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు