చెన్నైలో బిజీ గా ఉన్న సిద్దార్థ్ ,హన్సిక

చెన్నైలో బిజీ గా ఉన్న సిద్దార్థ్ ,హన్సిక

Published on Jan 17, 2013 12:43 AM IST

Siddharth,-Hansika
సిద్దార్థ్ మరియు హన్సిక ఒక చిత్రం కోసం కలిసి పని చెయ్యనున్నారు. “తీయ వేల సేయనుం కుమారు” అనే పేరుతో రానున్న ఈ చిత్రం ఈ మధ్యనే చెన్నైలో మొదలయ్యింది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ మరియు హన్సిక IT ప్రొఫెషనల్స్ గా కనిపించనున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి “ఓ మై ఫ్రెండ్” చిత్రంలో కనిపించారు ఈ చిత్రాన్ని కుష్బూ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా సిద్దార్థ్ నటించిన “జబర్దస్త్” చిత్రం విడుదలకు సిద్దమయ్యింది ఈ చిత్రంలో అయన సరసన నిత్య మీనన్ మరియు సమంతలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హన్సిక “సింగం -2”, “బిరియాని”, “వాలు”, “వెట్టై మన్నన్” మరియు మంచు మనోజ్ చిత్రంలో కనిపించనున్నారు.

తాజా వార్తలు