జపాన్ వెళ్ళీన సిద్దార్థ్, హన్సిక

జపాన్ వెళ్ళీన సిద్దార్థ్, హన్సిక

Published on Apr 9, 2013 2:13 AM IST

sidhartha_hansika
సిద్దార్థ్, హన్సిక హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘సంథింగ్.. సంథింగ్’. ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం ఈ టీంవారు జపాన్ వెళ్లారు. సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఖుష్బూ నిర్మిస్తోంది. ఈ సినిమాని తెలుగులో లక్ష్మీ గణపతి ఫిలింస్ వారు ఆంద్ర ప్రదేశ్ అంతట విడుదల చేస్తున్నారు. ‘ఈ రాత్రికి నేను జపాన్ వెళ్తున్నాను. ఆదివారం ఉదయానికి అక్కడ వుంటాను. నేను ఈ సినిమా గురించి చాలా నమ్మకంగా వున్నాను’ అని సిద్దార్థ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలోని పాటలని జపాన్ లోని తోయమలో షూట్ చేసే అవకాశం వుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ లో బ్రహ్మానందం, తమిళ వర్షన్ లో సంతానంలు నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో ‘తీయ వేల సైయ్యనుమ్ కుమారు’ పేరుతో నిర్మించబడుతోంది. సత్య సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే లో విడుదలయ్యే అవకాశం వుంది.

తాజా వార్తలు