లక్స్ ప్రచారకర్తలుగా సిద్ధార్ధ్ మరియు సమంత

siddharth-and-samantha

‘జబర్దస్త్’ సినిమాలో కలిసి నటించిన సిద్ధార్ధ్, సమంత మరోసారి జతకట్టనున్నారు. కానీ ఈసారి వీరిద్దరూ నటిస్తుంది సినిమాలో కాదు, ఒక టి.వి ప్రచార చిత్రంలో. దీనికి గానూ ఇటీవలే బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకున్నారు.ఎంతో మంది అందాలరాశులు మరియు స్టార్ హీరోలు ప్రచారకర్తలుగా నటించిన ‘లక్స్’ కు వీరు నియమింపబడ్డారు

ఈ విషయం సమంత చాలా ఆనందపడుతూ మీడియాకు తెలియజేసింది. చిన్నపట్నుంది తనని లక్స్ గర్ల్ అంటారని, ఆ కోరిక ఇలా తీరిందని చెప్పుకొచ్చింది. షూటింగ్ సమయంలో తనకు చాలా సహాయం చేసిన సిద్ధార్ధ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రచారచిత్రం నవంబర్ నుండి టి.వి లలో ప్రసారంకానుంది

Exit mobile version