అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. ప్రభాస్ కోసం హను ప్రయత్నాలు..!

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ చేసిన ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడితో పీరియాడిక్ ఎపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఓ స్టార్ యాక్టర్‌ను తీసుకునేందుకు దర్శకుడు హను రాఘవపూడి ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలో ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను సంప్రదించారట మేకర్స్. అయితే, అభిషేక్ తన నిర్ణయాన్ని ఇంకా చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి పాత్రను అభిషేక్ చాలా ఈజ్‌తో చేయగలడు అనే ధీమాతో చిత్ర యూనిట్ ఈ మేరకు ఆయన్ను సంప్రదించారట.

ఇక గతంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’లో ప్రభాస్‌తో తలపడి నటించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ కోసం ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా వస్తే ఇక వారి మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version