నారా రోహిత్ హీరోగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘ప్రతినిధి’ సినిమాలో శుబ్ర ఐయప్ప మొదటి సారిగా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ గా నటిస్తోందని సమాచారం. ఈ బెంగుళూర్ నటి తను నటించిన మొదటి సినిమాపై చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ” ఈ సినిమా మొత్తం ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇది మంచి మెసేజ్ సినిమా. ఈ సినిమా నిర్మాణంలో ప్రతి ఒక్కరు చాలా బాగా సహకరించారు’ అని అంది.
ఆమె వైవీఎస్ చౌదరి సినిమా ‘రేయ్’లో కూడా నటించాలి. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగింది. దానితో శుభ్ర ‘ప్రతినిధి’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. నారా రోహిత్ ఈ సినిమాలో ఒక కమాన్ మ్యాన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తను ముఖ్యమంత్రి ని కిడ్నాప్ చేస్తాడు. ప్రశాంత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ రవి స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. సుధా సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని జే సాంబ శివ రావు నిర్మించాడు.