బలుపు విజయంతో ఆనందంలో ఉన్న శృతిహాసన్

బలుపు విజయంతో ఆనందంలో ఉన్న శృతిహాసన్

Published on Jun 28, 2013 11:10 PM IST

Shruthi
రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన ‘బలుపు’ సినిమా ఈ రోజు విడుదలయింది. ఈ సినిమా అన్ని సెంటర్లలో విజయంసాధించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో చాలా కాలం తరువాత రవితేజను మాస్ పాత్రలో గోపీచంద్ మలినేని చూపించాడు. ఇదిలావుంటే శృతిహాసన్ ఈ సినిమా విజయంతో అమితానందంలో వుంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా విజయం సాదించిన తరువాత ఈ భామ గ్లామరస్ అవతారంతో రిలీజ్ కు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. “‘బలుపు’ సినిమా విజయవంతం చేసి, నాకు కృతజ్ఞతలు చెప్పిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇవి నాకు చాలా సంతోషానిచ్చాయి:) మిమ్మల్ని ఆనందపరచడం నాకు ఇష్టం… లవ్ యూ ట్వీప్స్ ” అని ట్వీట్ ఇచ్చింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా తరువాత శృతి హాసన్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో కనిపిస్తుంది.

తాజా వార్తలు