అర్జున్ రాంపాల్ సరసన నటిస్తున్న శృతి హాసన్

అర్జున్ రాంపాల్ సరసన నటిస్తున్న శృతి హాసన్

Published on Nov 6, 2012 11:49 PM IST

శృతి హాసన్ హిందీలో నాలుగవ చిత్రం కోసం సంతకం చేసింది. “డి డే” అనే ఈ చిత్రంలో శృతి నటించనుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ RAW(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ గా కనిపించనున్నారు. భారతదేశంలో ప్రధాన భద్రత సంస్థ RAW ఇది దాదాపుగా అమెరికన్ CIA లాంటిది. ముస్లిం యువతీ పాత్రలో శృతి హాసన్ కనిపించనున్నారు. అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నిఖిల్ అద్వాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం అహ్మదాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. గతంలో “లక్” చిత్రంతో బాలివుడ్ కి పరిచయం అయిన ఈ భామ తరువాత మధుర్ భండార్కర్ దర్శకత్వంలో “దిల్ తో బచ్చా హాయ్ జీ ” చిత్రంలో కనిపించారు. తెలుగు మరియు తమిళంలో “గబ్బర్ సింగ్” మరియు “3” వంటి చిత్రాలలో కనిపించిన తరువాత ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” చిత్ర హిందీ రీమేక్ లో నటిస్తున్నారు. తాజాగా “డి డే” చిత్రం ఒప్పుకున్నారు. ఇవి కాకుండా ఈ నెలాఖర్లో రవితేజ “బలుపు” చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు

తాజా వార్తలు