శృతి హాసన్ మళ్ళీ బంగారం పట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈ నటి హిందీలో వస్తున్న “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” చిత్ర రీమేక్ లో నటించేందుకు సంతకం చేసింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలివుడ్లో ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. టిప్స్ ఇండస్ట్రీస్ కుమార్ తౌరని కొడుకు గిరీష్ తౌరని ఈ చిత్రంతో కథానాయకుడుగా పరిచయం కానున్నారు. శృతి హాసన్ ఈ విషయాన్నీ ట్విట్టర్లో దృవీకరించారు. కొద్ది వారాల క్రితం ప్రభుదేవా “రౌడి రాథోడ్” చిత్రం భారీ విజయం సాదించింది. ఈ విజయంతో బాలివుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. “గబ్బర్ సింగ్” చిత్రం తరువాత శృతి హాసన్ చాలా జాగ్రత్తగా చిత్రాలను ఎంపిక చేసుకుంటుంది. ఈ చిత్రం కాకుండా త్వరలో ఈ నటి రవితేజ సరసన “బలుపు” చిత్రంలో కనిపించనుంది.