ప్రభు దేవా చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్న శృతి హాసన్


ప్రభు దేవా దర్శకత్వంలో రానున్న హిందీ చిత్రం చిత్రీకరణలో పాల్గొనడానికి శృతి హాసన్ సిద్దమయ్యింది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి ఈ భామ సంతకం చేసింది. ఈ చిత్రం “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” చిత్ర రీమేక్ అంటున్నారు. ప్రముఖ బాలివుడ్ నిర్మాత కుమార్ తౌరని కొడుకు గిరీష్ కుమార్ తౌరని ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ” రేపు ప్రభు దేవ మరియు గిరీష్ కుమార్ తౌరనిలతో చిత్రీకరణలో పాల్గోననున్నాను చాలా సంతోషంగా ఉంది” అని శ్రుతి హాసన్ ట్విట్టర్లో పేర్కొనింది. ఇది బాలివుడ్ లో శ్రుతి హాసన్ కి మూడవ చిత్రం గతంలో “లక్” మరియు “దిల్ తో బచ్చా హాయ్ జీ” చిత్రాలలో కనిపించారు. “గబ్బర్ సింగ్” చిత్రం భారీ విజయం సాదించిన తరువాత ఆమె కాన్ఫిడెంట్ గా ఉన్నారు కొలవేరి డీ పాటతో హిందీ మాట్లాడే ప్రాంతాలలో కూడా తన పేరు ప్రాముఖ్యం సంపాదించింది. ఈ చిత్రం తనని బాలివుడ్ కి తిరిగి పరిచయం చెయ్యబోయే చిత్రం అవ్వనుంది ఈ చిత్రానికి ప్రభు దేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నటి హిందీలో విజయం సాదిస్తుందా లేదా అని అందరి కళ్ళు శృతి హాసన్ మీదనే ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో రవితేజ “బలుపు” చిత్రీకరణలో పాల్గొంటుంది.

Exit mobile version