విజయాన్ని మించిన రుచి మరొకటి వుండదు. ఆ విషయం ఆ రుచిని ఆస్వాదించిన ప్రతీ వారికీతెలుసు . ఈ సినిమా రంగంలో అయితే ఆ రుచి విలువ మరింత మధురం. అలాంటి విజయాలను వరుసగా అందుకున్న భామలలో ఒకరు శృతిహాసన్. ఈమె నటించిన ‘ఎవడు’ సినిమా మంచి విజయం సాధించి అభిమానుల మన్ననలను పొందుతుంది. గత ఏడాది బలుపు తో హిట్ కొట్టిన ఈ భామ 2014ని ఘనంగానే ఆహ్వానించింది
ఆమెపై కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో రేస్ గుర్రం సినిమాలో, వెల్కం బ్యాక్ సినిమాలలో నటిస్తుంది. అంతే కాక ఒక తమిళ సినిమా అవకాశాలు కుడా వున్నాయి. ఈ భామ త్వరలో సి.సి.ఎల్ లో ప్రచారకర్తగా వ్యవహరించనుంది. త్వరలో తెలుగు సినిమాను అంగీకరించే సూచనలు వున్నాయి