డి-డే సినిమాకు ప్రశంసలు అందుకున్న శృతి హాసన్

డి-డే సినిమాకు ప్రశంసలు అందుకున్న శృతి హాసన్

Published on Jul 16, 2013 9:15 PM IST

Shruti_Haasan
నిఖిల్ అద్వాని దర్శకత్వంలో శ్రుతి హాసన్ నటించిన ‘డి-డే’ సినిమాలో ఆమె నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అర్జున్ రాంపాల్, ఇర్ఫాన్ ఖాన్ , హ్యుమా ఖురేషి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రపోషించింది

కరాచీ ప్రాంతానికి చెందిన ఒక వేశ్య పాత్రలో ఆమె కనిపించనుంది. ఈమె హీరోతో ప్రేమలో పడినతరువాత కధ ఏ విధంగా మలుపుతిరిగింది అనేది ఆసక్తికరంకానుంది. శృతి కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ముంబాయిలో ఈ సినిమా ప్రీమియర్ చుసిన ప్రముఖ సెలబ్రిటీలు ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఈ సినిమా జూలై 19 న విడుదల కానుంది. అదే రోజు ఈమె నటించిన మరో చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కూడా విడుదలకానుంది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. గిరీష్ కుమార్ శృతి కు జంటగా నటించాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు