నాగార్జున రోల్‌పై శ్రుతి కామెంట్స్.. తెలుగు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఖాయం!

నాగార్జున రోల్‌పై శ్రుతి కామెంట్స్.. తెలుగు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఖాయం!

Published on Jul 26, 2025 6:01 PM IST

Shruti-Haasan-Nagarjuna

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై బజ్‌ను అమాంతం పీక్స్‌కు తీసుకెళ్లింది. కాగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అందాల భామ శ్రుతి హాసన్ ఈ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

ఈ సినిమాలో నాగార్జున అక్కినేని చాలా రోజుల తర్వాత ఓ నెగెటివ్ రోల్‌లో నటిస్తున్నాడని.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి తాను షాక్ అయ్యానని.. తెలుగు ప్రేక్షకులకు ఆయన నటన ఓ ట్రీట్‌గా ఉండబోతుందని ఆమె కామెంట్ చేసింది. దీంతో కూలీ సినిమాలో నాగ్ ఎలాంటి పవర్‌ఫుల్ విలనిజం చూపిస్తాడా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు