చాలా గ్యాప్ తరువాత హిందీలో నటిస్తున్న శ్రీయ

చాలా గ్యాప్ తరువాత హిందీలో నటిస్తున్న శ్రీయ

Published on Apr 6, 2013 10:10 AM IST

shriya_saran

చాలా గ్యాప్ తరువాత శ్రీయ బాలీవుడ్ లో నటించబోతోంది. ఇంతకు ముందు శ్రీయ ‘ఆవరపాన్’, ‘మిషన్ ఇస్తాంబుల్’, ‘ఏక్ – ద పవర్ అఫ్ వన్’, ‘గలీ గలీ మెయిన్ చోర్ హై’ సినిమాలలో నటించింది. తాజాగా శ్రీయ, జిమ్మీ శేర్గిల్ తో కలిసి నటించడానికి సంతకం చేసిందని సమాచారం. ఈ సినిమాని కరణ్ భూటని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాకి ‘వాల్మీకి కి బందూక్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాని చంబల్ వల్లీ బ్యాక్ డ్రాఫ్ లో గన్స్ తో తిరిగే ఉత్తర భారత దేశం స్టైల్ లో నిర్మించనున్నారు. శ్రీయ శరన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది.

ముఖ్యంగా శ్రీయ ఈ రోజు వైజాగ్ లో తన రాబోవు సినిమా పవిత్ర ఆడియోని లంచ్ చేయనుంది. జనార్ధన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషాలలో విడుదల చేయనున్నారు. ఆడవారిపై జరిగే అన్యాయాలను ఎదిరించి న్యాయం కోసం పోరాడే పాత్రలో, రాజకీయ నాయకురాలిగా శ్రీయ నటించనుంది. శ్రీయ నాగార్జునతో విక్రం కుమార్ ‘మనం’ సినిమాలో నటించనుంది. ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో తెరకెక్కనుంది.

తాజా వార్తలు