ప్రస్తుతం బిజీగా ఉన్న కథానాయికలలో శ్రియా ఒకరు. ఇటీవలే ఒక ఫేమస్ మెన్ మాగజైన్ కి హాట్ గా ఫోజులిచ్చింది. ఆ తర్వాత తిరుమలలో ప్రత్యక్షమైవేంకటేశ్వరుని దర్శించుకుంది. ప్రస్తుతం ఈ భామ తను నటిస్తున్న ‘చంద్ర’ అనే ద్విభాషా చిత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో శ్రియా యువరాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం అంతా మైసూర్, బెంగుళూరు మరియు రాజస్తాన్ లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒక రాజ వంశంలో పుట్టిన ఒక అమ్మాయి సాధారణ జీవితాన్ని గడపలేక ఎదుర్కొనే ఇబ్బందుల చుట్టూ అల్లుకొన్న కథ ఇది. కన్నడ మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. రూప అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ శ్రీవత్స సంగీతం అందిస్తున్నారు. శ్రియా ప్రస్తుతం ఈ చిత్రం కాకుండా త్వరలో విడుదల కానున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మళ్ళీ చంద్ర టీంతో కలిసిన శ్రియా
మళ్ళీ చంద్ర టీంతో కలిసిన శ్రియా
Published on Aug 14, 2012 12:46 AM IST
సంబంధిత సమాచారం
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
- పెద్ది ‘సుందరి’కి పెద్ద పరీక్షే..!
- టాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో.. ఈసారి నిఖిల్ వంతు
- ‘ఘాటి’ ప్రమోషన్స్‌కు అనుష్క నో.. వర్కవుట్ అయ్యేనా..?
- ‘మిరాయ్’ కోసం రంగంలోకి హోంబలే ఫిల్మ్స్..!
- అఖండ 2 : ఆ ఒక్క క్లారిటీ ఎప్పుడొస్తుంది..?
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?