తన కల ఫలించిన సంతోషంలో శ్రద్ధాదాస్

తన కల ఫలించిన సంతోషంలో శ్రద్ధాదాస్

Published on Jan 21, 2014 12:18 AM IST

Shradda-Das
శ్రద్ధాదాస్ ప్రస్తుతం పరమానందంలో వుంది. తను ఆరాధించే ఒకరిని ఈరోజు కలిసింది. అది ఒక బెంగాల్ సినిమా పుణ్యమా అని. ‘రాయల్ బెంగాల్ టైగర్’ పేరుతొ సాగే ఈ సినిమాలో బెంగాలి సూపర్ స్టార్ జీత సరసన నటించనుంది. దీనికోసం కలకత్తా వెళ్ళిన ఈ భామ సౌరభ్ గంగూలీ ని కలిసింది

అక్కడ గంగూలీ ‘దాదాగిరి’ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహిస్థున్నాడు. ఈ సినిమా బృందం ఆ కార్యక్రమానికి వెళ్లి పాల్గున్నారు. అక్కడ గంగూలీ ని చుసిన శ్రద్ధ సంతోషంతో “రాయల్ బెంగాల్ టైగర్’ సినిమా ప్రచారంలో భాగంగా గంగూలీ ని కలవడం నా అదృష్టం. సినిమాలో పెద్ద పేర్లు వున్నాయి గనుక ఈ సినిమా పెద్ద విజయం సాధించనుందని ఆశిస్తున్నా” అని ట్వీట్ చేసింది

ఈ భామ సాయి ధరం తేజ్ రేయ్ సినిమాలో గ్లామర్ కలిపిన విలన్ పాత్ర పోషించిందని సమాచారం. సయామీ ఖేర్ హీరొయిన్.. వై.వి.ఎస్ చౌదరి దర్శకుడు

తాజా వార్తలు