‘పుష్ప’ సాంగ్స్ కి రెడీ అవుతున్నారు !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ షూటింగ్ కోసం సుకుమార్ టీమ్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారని.. నవంబర్ 20 నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి.. ముందుగా సాంగ్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో కేవలం సాంగ్స్ కోసం భారీ సెట్స్ ను కూడా
నిర్మించారట. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనట. అన్నట్లు ఈ సెట్స్ లోనే రెండు సాంగ్స్ ను తీయబోతున్నారు. ముందుగా బన్నీ – రష్మిక పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ ను సత్య మాస్టర్ నేతృత్వంలో తీయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సాంగ్ తరువాత సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్‌ హీరోయిన్ ఊర్వశి రౌటేలాను తీసుకున్నారు. అలాగే తమిళ మాజీ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడని.. విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ లో మాధవన్ చేయనున్నాడని సమాచారం. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించనున్నారు. అయితే సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

Exit mobile version