‘గేమ్ ఛేంజర్’ కి షాకింగ్ టీఆర్పీ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో అంచనాలు అందుకోలేదు అని తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ తర్వాత టెలివిజన్ టెలికాస్ట్ కి కూడా వచ్చింది.

మరి టీవిలో ఈ చిత్రం అందుకున్న రేటింగ్ బయటకి వచ్చింది. మరి గేమ్ ఛేంజర్ మొదటి టెలికాస్ట్ లో 5.02 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ని అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇది ఒకింత తక్కువే కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన పలు భారీ బ్లాక్ బస్టర్స్ పరిస్ధితి కూడా అంతే అని చెప్పాలి. సలార్, కల్కి 2898 ఎడి లాంటి హిట్ సినిమాలకి కూడా ఇదే రీతి రేటింగ్ వచ్చింది. మరి వాటితో చూస్తే గేమ్ ఛేంజర్ స్మాల్ స్క్రీన్ పై హిట్టే అని చెప్పాలి.

Exit mobile version