బన్నీ ‘పుష్ప’ నుండి తప్పుకున్న స్టార్ ?

బన్నీ ‘పుష్ప’ నుండి తప్పుకున్న స్టార్ ?

Published on Apr 14, 2020 11:12 AM IST

అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో తమిళ హీరో విజయ్‌ సేతుపతి పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం విజయ్ ఏప్రిల్ అంతా డేట్స్ ఇచ్చాడట. అయితే కరోనా వైరస్ కారణంగా షూట్ క్యాన్సల్ అయింది. దాంతో డేట్స్ కుదరక ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెకెక్కించబోతున్నారు. అందుకే, స్టార్ కాస్ట్ ను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట.

విలన్ గా సునీల్‌ శెట్టిని ఒప్పించాలని సుకుమార్ అనుకుంటున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు