‘హరిహర వీరమల్లు’ ఒక్క క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ అలాగే జ్యోతికృష్ణ కలయికలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల తేదీ పట్ల మంచి ఆసక్తి నెలకొనగా ఈ గ్యాప్ లో సినిమా విఎఫ్ఎక్స్ పనులని మేకర్స్ కంప్లీట్ చేశారు. అయితే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ నెవర్ బిఫోర్ లెవెల్లో ఉంటుంది అని మేకర్స్ ప్రామిస్ చేశారు.

ఇక దీనిపై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం హరిహర వీరమల్లులో మొత్తం 6000 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట. అలాగే ప్రతీ షాట్ లో 10 లేయర్స్ ఉంటాయని ఇలా మొత్తం వర్క్ కి ఒకెత్తు అయితే ఒక్క క్లైమాక్స్ పోర్షన్ విఎఫ్ఎక్స్ కోసమే మేకర్స్ ఏకంగా 25 కోట్లు వెచ్చించినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మేకర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఆడియెన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా సిద్ధం చేస్తున్నారట.

Exit mobile version